యాంకర్ రవి సోషల్ మీడియాలో ఎలా సెటైర్లు వేస్తుంటాడు.. ఎలాంటి పోస్ట్‌లు పెట్టి నవ్విస్తాడో అందరికీ తెలిసిందే. తన భార్య నిత్య, పాప వియా అల్లరి గురించి చెబుతూ పోస్ట్‌లు పెడుతుంటాడు.. లేదా తన ఈవెంట్‌లు, ప్రోగ్రాం, షోలను ప్రమోట్ చేసుకుంటాడు. ఈ మధ్య రవి తన సంక్రాంతి ఈవెంట్ గురించి చాలా పోస్ట్‌లు పెడుతున్నాడు. ఇట్సే ఫ్యామిలీ పార్టీ అనే సంక్రాంతి ఈవెంట్‌లో రవి రచ్చ చేయనున్నాడు. ఇందులో ఐదేళ్ల తరువాత లాస్యతో కలిసి షోను హోస్ట్ చేయబోతోన్నాడు.
రవి, లాస్య కలిసి ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుండటంతో అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా అభిజిత్ కూడా పాల్గొనబోతోన్నాడు. మామూలుగా అభిజిత్ ఎవ్వరికీ దొరకడం లేదు.. బయట కూడా ఇంటర్వ్యూలంటూ ఎలాంటి హడావిడి చేయడం లేదు. రవి అభిజిత్ ఇద్దరూ బంధువులు అయినా కూడా ఇద్దరూ కలుసుకోలేకపోతోన్నారు. ఇదే విషయాన్ని ఆ మధ్య లైవ్‌లోనూ చెప్పాడు. అభిజిత్ మామ అంటూ వియా అడుగుతుంది కాని టైం దొరకడం లేదు అతన్ని కలవడానికి అని రవి చెప్పుకొచ్చాడు.
మొత్తానికి సంక్రాంతి ఈవెంట్‌లో అలా కుదిరిందని చెప్పేశాడు. బిజీగా ఉండే తన ఫేవరేట్ అభిజిత్ మామను ఇట్సే ఫ్యామిలీ పార్టీ ఈవెంట్‌లో వియా కలుసుకుందని రవి చెప్పుకొచ్చాడు. బిజీగా ఉండే అని చెప్పడంలోనూ అభిజిత్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. అభిజిత్ నిజంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. తన సినిమా కథలు స్క్రిప్ట్‌లు వినే పనిలోనే అభిజిత్ బిజీగా ఉన్నాడు. అందుకే బయట ఎక్కువగా కనిపించడం లేదని తెలుస్తోంది.