జబర్దస్త్ యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. బుల్లి తెర మీద వాళ్లు కనిపించారంటే చాలు.. రచ్చ రంబోలానే. వాళ్ల జంట చూడముచ్చటగా ఉంటుంది. వాళ్ల మధ్య రొమాన్స్ కూడా బాగుంటుంది. మొత్తం మీద వాళ్లు బుల్లి తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు చప్పట్లతో స్వాగతాలు చెబుతారు. ఆ జంటకు ఉన్న క్రేజే వేరప్పా. అందుకే రష్మీ అంటే సుడిగాలి సుధీర్.. సుడిగాలి సుధీర్ అంటే రష్మీ.
అయితే.. వీళ్లిద్దరి మధ్య అసలు ఏమున్నది? లేదు? అనేది దేవుడికి ఎరుక. అయితే.. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. ఢీ షోలో, జబర్దస్త్ లో సుధీర్ అప్పుడప్పుడు డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ గా రష్మీకి ప్రపోజ్ చేసినా రష్మీ నవ్వుకొని ఊరుకోవడం చూస్తే ఖచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు.
ఈనేపథ్యంలో రష్మీ.. సుడిగాలి సుధీర్ కు షాక్ ఇచ్చింది. సుడిగాలి సుధీర్ కు హ్యాండ్ ఇస్తూ పెళ్లికి రెడీ అయిపోయింది రష్మీ. సుడిగాలి సుధీర్ ను కాకుండా వేరే వ్యక్తిని రష్మీ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తనకు కాబోయే వాడిని రష్మీనే సెలెక్ట్ చేసుకున్నదట.
ఇప్పటికే రష్మీ వయసు మూడు పదులు దాటింది. తోటి యాంకర్లు కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీంతో రష్మీ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిందట. అయితే.. తనకు కాబోయే వరుడు బిజినెస్ మెన్ అని తెలుస్తోంది. అతడితో కొన్నేళ్లు ప్రయాణం చేశాకనే ఈ నిర్ణయం తీసుకున్నదట. రష్మీ అభిప్రాయాలను కూడా ఆ వ్యక్తి గౌరవిస్తుండటంతో తను కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇరు ఫ్యామిలీలు కూడా వీళ్ల పెళ్లికి ఓకే చెప్పేసి.. ముహూర్తం పెట్టే పనిలో పడ్డారట. అంత వరకు బాగానే ఉంది కానీ.. మరి సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటి? రష్మీ పక్కన సుధీర్ అన్న కాకుండా వేరే వ్యక్తిని ఊహించుకోలేము. రష్మీ.. ఇలా చేయడం కరెక్ట్ కాదు.. అంటూ సోషల్ మీడియాలో సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.