యాంకర్ రష్మీపై యాంకర్ ప్రదీప్ సంచలన కామెంట్.. సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం

యాంకర్ ప్రదీప్, యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ ముగ్గురు కలిసి కనిపించే షో ఢీ. ఈ షోలో ఈ ముగ్గురు కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. దానితో పాటుగా మరికొన్ని ఈవెంట్లలోనూ వీళ్లు మెరుస్తుంటారు.

Anchor Pradeep Comments On Rashmi
anchor pradeep comments on Rashmi

వీళ్లు ముగ్గురు కలిస్తే ఇక అంతే. ఒకరి మీద మరొకరు పంచుల మీద పంచులు వేసుకొని జనాను ఎంటర్ టైన్ చేస్తుంటారు. వీళ్ల రచ్చ మామూలుగా ఉండదు. అందుకే వీళ్లు అంతగా ఫేమస్ అయ్యారు.

ఇక.. సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఆ జంటకు ఉన్న క్రేజే వేరు. వాళ్లు నిజంగా ప్రేమించుకుంటున్నారా? లేదా? అనేది పక్కన పెడితే.. సుధీర్ అంటే రష్మీ.. రష్మీ అంటు సుధీర్.

రష్మీకి కూడా సుధీర్ అంటే చాలా ఇష్టం. సుధీర్ కు రష్మీ అంటే ఇష్టం. అందుకే జబర్దస్త్ స్కిట్లలోనూ సుధీర్ అప్పుడప్పుడూ రష్మీ మీద తనకున్న ప్రేమను అందరికీ తెలియపరుచుతుంటాడు. దానికి రష్మీ కూడా ఏమనదు. అంటే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని అంతా అనుకుంటున్నారు.

ఇప్పుడు ప్రదీప్ తో పాటుగా రష్మీ, సుధీర్ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రష్మీ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. సుధీర్ కూడా హీరోగా చాలా సినిమాల్లో నటించాడు.

Anchor Pradeep Comments On Rashmi
anchor pradeep comments on Rashmi

ఇక.. తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో రష్మీ నటిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసింది. కిరీటం పెట్టుకొని స్మైల్ ఇస్తూ రష్మీ అందంగా ముస్తాబయింది. ఆపోస్టర్ లోనే పోతురాజు గాడి లవర్ వాణిగా రష్మీ అంటూ చిన్న క్యాప్షన్ పెట్టారు.

దాన్ని బేస్ చేసుకొని యాంకర్ ప్రదీప్ ఓ కామంట్ చేశాడు. ఈ పిల్ల మా పోతురాజు(నందు)గాడి పిల్ల.. ఈ పిల్లకి ఏమైనా అయితే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకునేది అతడే.. అర్థం అయిందా.. అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశాడు.

ఆ ట్వీట్ కు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయ్యారు. ప్రదీప్ మీద కాస్త గుర్రుగానే ఉన్నారు. రష్మీ.. సుధీర్ అన్న పిల్ల అని తెలుసు కదా.. అలాంటి పోస్టులు పెడితే ఎలా ప్రదీప్ అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఎంతమంది పోతురాజులు వచ్చినా.. మా పిల్ల సుధీర్ అన్నకే సొంతం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles