బుల్లితెరపై పులిహోర కలపడమే ఇప్పుడు ట్రెండ్. ఏదైనా ట్రాక్‌లు నడిపిస్తేనే వర్కౌట్ అవుతోంది. అలాంటివి చేస్తేనే షో హిట్ అయి.. సదరు ఆర్టిస్ట్‌లు పాపులర్ అవుతున్నారు. ఇలాంటి చిల్లర పనులన్నీ జబర్దస్త్, బిగ్ బాస్ వంటి ఎంటర్టైన్మెంట్ షోల్లో పర్వాలేదనిపించొచ్చు. కాస్త ముందుకు వచ్చాక ఢీ వంటి డ్యాన్స్ షోల్లోనూ ఓకే అనిపించొచ్చు. కానీ ఎంతో మంది ఆస్వాదించే ఆరాధించే పాటల ప్రోగ్రాంలో కూడా ఇదే గోల. జీ తెలుగులో కొత్తగా వస్తోన్న సరిగమప షోలో ప్రదీప్, రవి చేసే హల్చల్ మరీ దారుణంగా ఉంటోంది.
సరిగమప నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ అనే షో యశస్వీ కొండెపూడి ప్రదర్శనతో ఓ రేంజ్‌లో పాపులర్ అయింది. జాను సినిమాలోని లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటను పాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అతడి కోసం షో చూసే వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా షో ఓ రేంజ్‌లో వర్కవుట్ అయినా చంద్రబోస్, కోటి, ఎస్పీ శైలజ వంటి వారు ముందున్నా.. ఇలాంటి లవ్ ట్రాక్, పులిహోర కలపడం వంటివి చేస్తున్నారంటే పిచ్చి ఏ స్థాయి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం అన్నీ షోల్లో ఇలాంటి ట్రాకులున్నాయి కదా తాము ఒకటి క్రియేట్ చేయాలని అనుకున్నారేమో గానీ హారిక నారాయణ్ అనే సింగర్‌తో ప్రదీప్, రవి పులిహోర కలిపేస్తున్నారు. ఆమె కూడా వీటికి సిగ్గుపడుతూ, మెలికలు తిరుగుతూ పుటేజ్ ఇచ్చేస్తోంది. చూడటానికి హారిక అందంగా ఉండటంతో రవి, ప్రదీప్ చేసే చేష్టలు, వేసే వేషాలు బాగానే హైలెట్ అవుతున్నాయి. ఇలాంటి సింగింగ్ షోలో కూడా అలాంటి పనులు అవసరమా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=tQdi6TwU3fs