స్టార్ డైరెక్టర్ వల్ల జబర్దస్త్‌కు దూరమైన అనసూయ… ఎందుకో తెలుసా..?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో అనసూయకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో పాపులర్ అవటానికి కమెడియన్లు చేసే కామెడీ ఒక ఎత్తు అయితే అనసూయ గ్లామర్ షో కూడా మరొక కారణం. ఈ షోలో అనసూయ తన గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈశ్వర్ ద్వారా పాపులర్ అయిన అనసూయ సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకుంటుంది. బుల్లితెర మీద ఎంతో గ్లామరస్ గా కనిపించే అనసూయ వెండితెర మీద మాత్రం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది.

ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసల సైతం దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇలా బుల్లితెర మీద వెండితెర మీద సందడి చేస్తున్న అనసూయ డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తనకి ఎంతో మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన జబర్దస్త్ షో నుండి బయటకి రానుంది. అనసూయ ఇలా జబర్దస్త్ కి దూరం కావటానికి ఒక స్టార్ డైరెక్టర్ కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అనసూయ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటించనుంది. ఎప్పుడు వైవిద్యమైన పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపే అనసూయ ఈ వెబ్ సిరీస్ లో కూడా ఒక వేశ్య పాత్రలో కనిపించబోతోంది. అయితే ఆ వేశ్య పాత్ర కోసం అనసూయ చాలా రోజులు షూటింగ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల జబర్దస్త్ నుంచి బయటకు రావడమే బెస్ట్ అని అనసూయకి సలహా ఇచ్చాడని, ఆ సలహా మేరకు అనసూయ జబర్దస్త్ కి చెప్పనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వెబ్ సీరీస్ కోసం అనసూయ ముందుగానే వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతోందట.