అనసూయ, ఆమె భర్త్ సుశాంక్ భరద్వాజ్ గురించి బుల్లితెర ప్రేక్షకులంరదికీ తెలిసిందే. ఆమె ప్రేమ కథ, పెళ్లి, ఇంట్లో గొడవలు ఇలా ప్రతీ విషయం తెరిచిన పుస్తకమే. భర్త్ అంటే ఎంత ప్రేమా? భర్తకు అనసూయ అంటే ఎంత ప్రేమ అన్నది ఎన్నో సార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చింది. అనసూయకు ఎన్ని కష్టాలు వచ్చినా, ట్రోలింగ్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లినా భర్త ఎంతగా సపోర్ట్ చేశాడో చెబుతూ అనసూయ కన్నీరుమున్నీరైంది.
ఇంట్లో అనసూయ ఎంత సరదాగా అల్లరిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఇంట్లో జరిగే సంగతులను కూడా తెలిపింది. ఏది కనబడకపోయినా ఏడుస్తుంది.. బయటకు మాత్రం అలా గంభీరంగా కనిపిస్తుంది.. కానీ ఇంట్లో మాత్రం సెన్సిటివ్‌గా ఉంటుందని అనసూయ సుతి మెత్తని మనసు గురించి సుశాంక్ ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. ఆ మాటలకు అనసూయ కన్నీరుకూడా పెట్టుకుంది.
అనసూయ ఫ్యామిలీ నిన్న టూర్‌కు బయల్దేరింది. పెద్ద లగేజ్ బ్యాగ్‌ను కారుపై కట్టేసి ఎక్కడికో చెక్కేశారు. నేటి సుశాంక్ బర్త్ డేను సిటికీ దూరంగా ఎక్కడో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా అనసూయ తన భర్తకు స్పెషల్ విషెస్ చెప్పింది. చిన్న పిల్లలు పోల్చినట్టుగా జెల్లీ, నట్ బట్స్ అంటూ వెరైటీగా విషెస్ చెప్పింది. భర్త భుజాన వాలి దిగిన సెల్పీ మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ఈ ఫోటోకు నెటిజన్లు తమ కామెంట్లను పెట్టి హల్చల్ చేస్తున్నారు.