ముద్దూ ముచ్చట లేదంటోన్న అనసూయ.. కోరికను బయటపెట్టిన హైపర్ ఆది

Anasuya Hyper Aadi Skit In Jabardasth

హైపర్ ఆది,అనసూయలు స్కిట్‌లలో చేసే కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. అనసూయ మీద క్రష్ ఉన్నట్టు, ఆమెను ట్రై చేస్తున్నట్టు హైపర్ ఆది మధ్య మధ్యలో పంచ్‌లు వేస్తుంటాడు. అనసూయను తలుచుకుంటూ వెంటనే భరద్వాజ్‌ను కూడా స్కిట్లలో వాడేస్తుంటాడు. అయితే కొన్ని సార్లు వీరిద్దరి స్కిట్లు బాగానే ఉంటాయి. ఇంకొన్ని సార్లు మాత్రం హద్దులు దాటుతుంటాయి. అలా వచ్చే వారం మాత్రం హైపర్ ఆది తన మనసులోని కోరికలను బయటపెట్టేసినట్టు కనిపిస్తోంది.

Anasuya Hyper Aadi Skit In Jabardasth
Anasuya Hyper Aadi Skit In Jabardasth

వచ్చే వారం ఎపిసోడ్‌లో రోబో స్పూఫ్ చేసిన హైపర్ ఆది రజినీ పాత్రను పోషించాడు. ఇక అనసూయ ఐశ్వర్య రాయ్ పాత్రలో కనిపించింది. రోబోను తయారుచేయడంలో నిమగ్నమైన వశీ తన ప్రేయసిని పట్టించుకోకుండా ఉంటాడు. ఆ సీన్‌ను స్టేజ్ మీద స్ఫూప్ చేశారు. అయితే ఇందులో ప్రాక్టీస్‌లో ఉన్న డైలాగ్, స్క్రిప్ట్‌లో రాసిన డైలాగ్ కాకుండా.. తన సొంత డైలాగ్ చెప్పి హైపర్ ఆది తన కోరికను బయటపెట్టాడు. స్టేజ్ మీదే అలా చెప్పడంతో అనసూయ షాక్ అయింది.

ఇన్నాళ్లూ ఎందుకు నన్ను పట్టించుకోలేదు.. ఓ ముద్దూ ముచ్చటా లేదని అనసూయ కసురుకుంటుంది. అయితే ఆ డైలాగ్‌కు ఆది కౌంటర్ వేస్తూ.. రెండు చేతులూ జాపుతా రా మరి అని అంటాడు. దీంతో అనసూయ ఫైర్ అవుతూ.. ఒరిజినల్ డైలాగ్ చెప్పు అని అంటుంది. ల్యాబ్‌లో ఇలా బిజీగా ఉన్నానంటూ ఏదో ఒక కారణం చెబుతాడు. అంత టైం లేనప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావ్ అని మరో డైలాగ్ అనసూయ వదిలింది. దానికి కూడా హైపర్ ఆది స్పందిస్తూ.. రా మరి అని అంటాడు. ఇక హైపర్ ఆదిని తట్టుకోలేక అనసూయ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయింది. మొత్తానికి ఆది అనసూయలు మాత్రం ఇలా స్కిట్లతో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు.