Anasuya : మళ్ళీ ట్రోల్ కి గురైన అనసూయ…మహిళలను గౌరవించడం గురించి నీతులు చెబుతున్న జబర్దస్త్ యాంకర్…!

Anasuya : అనసూయ అటు బుల్లి తెర పై ఇటు వెండి తెరపై పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ తో యాంకర్ గా స్థిరపడిపోయిన అనసూయ ఆ తరవాత సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంటోంది. రంగస్థలం ఆమె సినీ కెరీర్ ను మలుపు తిప్పింది. రంగస్థలం లో రంగమ్మత్త పాత్రతో మెప్పించింది. ఇక ఈ మధ్య పుష్ప లో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి దక్షాయని గా మెప్పించింది.ఇక ఇపుడు మరోసారి విలన్ పాత్రలో నటించబోతోంది.

ఇక అనసూయ సోషల్ మీడియా చాలా చురుకుగా ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంటుంది. ఇక ఈ అమ్మడి చేష్టలకు ట్రోలింగ్ కూడా బాగానే ఎక్కువే నెటిజన్ల ట్రోలింగ్ కు తరచూ గురవ్వుతూ ఉంటుంది అనసూయ. అటు యాంకరింగ్ లోనూ ఇటు నటనలోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న అనసూయ తన వస్త్రధారణలో మాత్రం తీవ్రంగా విమర్శించబడుతోంది.

అయినా సరే ఈమె వస్త్రధారణపై మాత్రం ఎప్పటికప్పుడు నెటిజన్ల నుంచి షాకింగ్ కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. అనసూయ కూడా ఏ మాత్రం తగ్గకుండా తన దైన శైలిలో గట్టిగా కౌంటర్లు వేస్తూ తన వస్త్రధారణ విషయంలో జోక్యం చేసుకోకండి అంటూ కూడా ఎన్నోరకాలుగా చెప్పింది. మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ నెటిజన్ల ట్రొల్స్ కి బాగా గురవుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మరోసారి చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నా అంటూ మాట్లాడిన మాటలకు తనదైనశైలిలో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అనసూయ.

ఒక నెటిజన్ అనసూయ వస్త్రధారణ విషయంలో స్పందిస్తూ అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి.ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారా..?తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు అంటూ ఏడుస్తున్న ఎమోజి ని షేర్ చేశాడు.ఇక ఆ కామెంట్ పై స్పందించిన అనసూయ దయచేసి మీ పని మీరు చూసుకోండి.నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగ జాతి పరువు తీస్తున్నారు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.