యాంకర్ శ్రీముఖికి పెళ్ళి సంబంధం తీసుకొచ్చిన అనంత శ్రీరామ్.. వద్దు సర్ అంటూ దండం పెట్టిన శ్రీముఖి!

బుల్లితెర ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్న యాంకర్లలో కొంత మంది ఇప్పటికీ బ్యాచిలర్ గా ఉంటున్నారు. ఇలా వీరి గురించి నిత్యం వీరి పెళ్లి విషయం పై భారీగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు పెళ్లి కాని వారిలో శ్రీముఖి ప్రదీప్ సుధీర్ రష్మీ వంటివారు ఉన్నారు. అయితే తరచూ ఏదో ఒక సందర్భంలో వీరి పెళ్లి గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. సరిగమప ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న శ్రీముఖికి ప్రముఖ రైటర్ అనంత శ్రీరామ్ ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చారు.

తాజాగా సరిగమప కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా ఒక కంటెస్టెంట్ రంగస్థలంలోని టైటిల్ సాంగ్ ఎంతో అద్భుతంగా పాడి అందరి మనసు దోచాడు.ఈ క్రమంలోనే అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ఒరేయ్ చిట్టి బాబు మా శ్రీముఖి ని పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగాడు. ఇలా శ్రీముఖికి అనంత శ్రీరామ్ పెళ్లి సంబంధం తీసుకురావడంతో శ్రీముఖి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.ఈ క్రమంలోనే టాపిక్ డైవర్ట్ చేస్తూ వెనక స్క్రీన్ పై ఉన్న చేపలని చూపిస్తూ ఇన్ని చేపలని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంటూ టాపిక్ మారుస్తుంది.

ఈ విధంగా శ్రీముఖి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ రెండు చేతులు జోడించి మీకు దండం సార్ అంటూ నమస్కరించింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ ప్రదీప్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే
ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.