మూడు నేషనల్ అవార్డులు అందుకున్న ఒక్క సన్నివేశం కోసం 20 టేకులు తీసుకున్న నటి?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులు సన్నివేశానికి అనుగుణంగా వారి హావభావాలను వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలలో సన్నివేశానికి అనుగుణంగా నటిస్తూ గొప్ప నటీనటులుగా పేరు సంపాదించుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంతటి మహానటి నటులు అయినా కానీ కొన్ని సన్నివేశాలు చేయడానికి ఒకటికి రెండుసార్లు టేకులు తీసుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శారద ఏకంగా మూడు జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు.

ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె విశ్వనాథ్ డైరెక్టర్ గా తెరకెక్కిన చిత్రం శారద. ఈ సినిమాలో శారద శోభన్ బాబు నటించారు. ఇందులో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు. ఒక పాత్రలో శారదకు భర్తగా ఉండగా మరొక పాత్రలో డాక్టర్ గా నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో శారద మతిస్థిమితం లేని అమ్మాయిగా ఉంటుంది ఈ క్రమంలోనే తన సోదరుడు పట్నం వెళ్లి డాక్టర్ గా ఉన్న శోభన్ బాబుతో తన చెల్లి పరిస్థితి చెప్పి తనను చికిత్స కోసం తీసుకువస్తానని చెబుతారు.

తన పరిస్థితి విన్న శోభన్ బాబు అవసరం లేదు నేనే మీ ఇంటికి వస్తానని తనతో పాటు ఇంటికి వస్తారు.ఈ విధంగా తన ఇంటిలో శోభన్ బాబును చూడగానే తన భర్తని భావించి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు నాకెందుకు అన్యాయం చేశారంటూ కాళ్లపై పడి ఏడ్చేసి సన్నివేశం చేస్తున్న సమయంలో శారద కళాతపస్వి విశ్వనాథ్ గారి అంచనాలకు తగ్గట్టు హావభావాలను వ్యక్తపరచలేకపోయారు. దీంతో ఆమె ఏకంగా 20 టేకులు తీసుకున్నారు. చివరికి 20 వ టేక్ ఓకే అయింది. ఇలా ఒక సన్నివేశం కోసం ఈమె 20 టేకులు తీసుకోవడం గమనార్హం.