Radhe Shyam: ఓటిటీలో రాధే శ్యామ్ విడుదల తేదీని ఫిక్స్ చేసిన అమెజాన్ … స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Radhe Shyam: దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక మొన్నటి వరకూ ఈ సినిమా రిలీజ్ పై వాయిదాల పర్వం కొనసాగడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతే కాకుండా ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో అనే సందిగ్ధంలో ఉన్న చిత్ర యూనిట్ ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో నెమ్మదిగా వేగం పెంచారు.

ఇక ఈ ప్రమోషన్స్ ను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లోనూ చేసేందుకు చిత్ర బృందం ఇప్పటికే దానికి తగిన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే ప్రభాస్, పూజా హెగ్డే చెన్నై కూడా వెళ్లినట్టు సమాచారం.

ఇక ఈ చిత్రానికి అన్ని ఇబ్బందులూ తొలగిపోయాయి.. రిలీజ్ కాబోతుంది అని అనుకుంటున్న సమయంలోనే, ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అదేంటంటే ఈ మూవీ ఇంకా విడుదలే కాలేదు.. అప్పుడే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు వస్తున్న వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మామూలుగా నిబంధనల ప్రకారం అయితే ఏ సినిమా అయినా థియేటర్ లో రిలీజ్ అయిన 50 రోజులకు ఓటీటీలో రిలీజ్ కావాలి. కానీ ఈ సినిమా అంతకంటే ముందే వస్తుందనే ప్రచారం జరుగుతుంది. మార్చి 25న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కావడమే దీనికి ముఖ్య కారణమని పలువురి అభిప్రాయం. ఇప్పటి వరకూ రాధే శ్యామ్ సినిమాపై వచ్చిన పాజిటివ్ టాక్ అలాగే కొనసాగితే 10 నుంచి 15 రోజులు మాత్రమే ఆడే అవకాశం ఉందని మరికొందరి వాదన. ముందు నుంచే ఆర్ ఆర్ ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలోనే ఓటీటీలోకి వస్తుందనే వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.