దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు భారీ డిస్కౌంట్ లతో వస్తువులు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ లో టీవిల మీద భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీల టీవిలపై అక్టోబర్ 16 వరకే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అందువల్ల టీవి కొనాలని అనుకునేవారు అక్టోబర్ 16 లోపు టీవి కోనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు.
టీసీఎల్ కంపెనీకి చెందిన ఐఫాల్కన్ బ్రాండ్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్‌లో 60 శాతం వరకు డిస్కౌంట్ ఉన్నాయి. 43 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ అసలు ధర రూ. 47,990. అయితే దసరా, దీపావళి సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో 60 శాతం డిస్కౌంట్ ఉండటం వల్ల ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,999కే పొందొచ్చు. ఈ టీవీ కొనుగోలుపై 60 శాతం డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇలా 60 శాతానికి 10 శాతం డిస్కౌంట్ కలిపి మొత్తం 70 శాతం డిస్కౌంట్ తో రూ. 17,249 కే టీవి సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ వంటి బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఒకవేళ ఈఎంఐ పెట్టుకొని టీవీ కొనుగోలు చేయాలని అనుకునేవారు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా టీవీని కొంటే 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. అదే ఈఎంఐ పెట్టుకుంటే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1706 . అలాగే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2237 కట్టాలి. క్రెడిట్ కార్డు లేని వారు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకొని 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1797 కట్టాలి. అలాగే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2328 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై అయితే 36 నెలల వరకు ఈఎంఐ పెట్టుకొని నెలకు రూ. 659 చెల్లించాలి. అలాగే 24 నెలలకు అయితే రూ. 931 చెల్లించాల్సి ఉంటుంది.