సలార్ సిరీస్ కోసం అదిరిపోయే ఆఫర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ సిరీస్ లో మొదటి పార్ట్ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం హోంబలే సలార్ పార్ట్ 1 బిజినెస్ పై ఫోకస్ చేసింది. ఈ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలని అనుకుంటున్నారు.

అలాగే సలార్ 2 మూవీకి సంబందించిన బిజినెస్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారంట. తెలుగు రాష్ట్రాలకి సంబందించిన డిస్టిబ్యూషన్ రైట్స్ కోసం బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. వారిలో గీతా ఆర్ట్స్ అత్యధికంగా 170 కోట్లు ఆఫర్ చేసిందంట. తరువాత దిల్ రాజు, ఆసియన్ వాళ్ళు కలిసి 160 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా, యూవీ సంస్థలు సంయుక్తంగా 150 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చాయి.

సురేష్ ప్రొడక్షన్ 135 కోట్ల ఆఫర్ ని హోంబలే ఫిలిమ్స్ వారికి ఇచ్చారంట. అయితే నిర్మాత విజయ్ కిరంగదూర్ మాత్రం ఏకంగా 225 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట. అది కూడా నాన్ రిఫండ్ ఫార్మాట్ లో ఆ మొత్తం ఇస్తే రైట్స్ ఇస్తానని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. 25 శాతం రేషియోతో రెండు వారల రెవెన్యూకి కూడా ఈ ఈ రైట్స్ తో పాటు హోంబలే ఫిలిమ్స్ నుంచి నిర్మాత విజయ్ అడుగుతున్నారంట.

అయితే నిర్మాతలు అడిగినంత డిస్టిబ్యూటర్స్ ఎవరూ సిద్ధంగా లేరంట. అయితే ట్రైలర్ రిలీజ్ వరకు వేచి చూసి అప్పుడు డీల్ క్లోజ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఎలాగూ సెప్టెంబర్ వరకు టైమ్ ఉంది కాబట్టి అందరూ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి సలార్ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉన్న నేపథ్యంలో బిజినెస్ పరంగా భారీగా డీల్స్ కుదిరే అవకాశం ఉందనే మాట ట్రెండ్ పండితుల నుంచి వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలోనే 170 కోట్ల వరకు ఆఫర్ వస్తే మిగిలిన భాషలలో కూడా భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో కనీసం 500 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ చేయాలని నిర్మాత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒటీటీ ఛానల్స్ నుంచి కూడా సలార్ డిజిటల్ రైట్స్ కోసం భారీ ధరతో ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట