తమిళ స్టార్ హీరోస్ లో అపారమైన క్రేజ్ ఉన్నటువంటి వారిలో దళపతి విజయ్ కూడా ఒకడు. ఒకప్పుడు మన తెలుగు సినిమాలు మూడు నాలుగు కలిపి ఓ సినిమాగా చేసుకునే విజయ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో రికార్డు రెమ్యునరేషన్ తీసుకునే హీరోస్ లో ఒకడిగా నిలిచాడు.
కాగా ఇప్పుడు విజయ్ హీరోగా అయితే చేసిన మాసివ్ అవైటెడ్ చిత్రమే “లియో”. తమిళ మోస్ట్ హ్యాపెనింగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేసిన రెండో సినిమా ఇది కావడం పైగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సినిమా కావడంతో దీనిపై హైప్ ఇప్పుడు మామూలు స్థాయిలో లేదు.
కాగా పాన్ ఇండియా సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా గ్రాండ్ రిలీజ్ కి ఈ సినిమాని ప్లాన్ చేస్తుండగా ఈ రిలీజ్ కి సంబంధించి అప్పుడే చిక్కులు స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ని ఓవర్సీస్ మార్కెట్ లో కొనేందుకు ఎవరూ అంత ఆసక్తి చూపించట్లేదు అట.
ఇదెందుకు అయితే ఓవర్సీస్ మార్కెట్ లో ఓ చిత్రం థియేటర్స్ లోకి తీసుకోవాలి అంటే అది ఖచ్చితంగా ఓటిటిలో 8 వారాలు తర్వాత మాత్రమే వస్తుంది అని అగ్రిమెంట్ ఉండాలి అట. కానీ లియో కి అలా లేదని అందుకే ఎవరూ ముందు రావట్లేదు అని అంటున్నారు.
కాగా లియో యూనిట్ అయ్యితే తమ స్ట్రీమింగ్ పార్ట్నర్ తో చర్చలు చేస్తున్నారు అని దీనితో ఫైనల్ గా ఏదోకటి తేలుతుంది అని సమాచారం. మరి ఇన్ని అంచనాలు ఉన్న ఈ సినిమా హిందీ వెర్షన్ ఎలా రిలీజ్ అవుతుందో చూడాలి.