అల్లు శిరీష్ మరో కోణం కూడా ఉంది. నచ్చిన వస్తువును దొంగతనం చేస్తాడట. అలా ఓ వస్తువును దొంగతనం చేయడం, అది మూడేళ్ల క్రితం మిస్ అవ్వడం, మళ్లీ ఈ మధ్యే అది కంటబడటంతో అల్లు శిరీష్ అసలు సంగతి చెప్పాడు. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైన కళ్లజోడు ఈ రోజు దొరికింది. మూడేళ్ల క్రితం నేను పోగొట్టుకున్నాను. మళ్లీ ఇన్నాళ్లకు నాకు దొరికింది. మనది అనుకున్నది ఏదైనా సరే చివరకు మన వద్దకే వస్తుందని కొటేషన్ కూడా చెప్పాడు.
ఆ కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు నా ఐక్యూ 25 పాయింట్స్ పెరిగాయి. ఇది శాస్త్రియంగా నిరూపించబడింది. వాటిని నేను ధరించినప్పుడు స్మార్టర్ అని ఫీల్ అవుతుంటాను. మామూలుగా నేను వాటిని తేజస్వీ మదివాడ దగ్గరి నుంచి దొంగతనం చేశాను. అది స్పెయిన్ దేశంలోని ఫ్లీ మార్కెట్‌లో దొరుకుతుందట. తేజస్వీ అక్కడే కొనుక్కుందట. కానీ దాన్ని ఎలా కొనాలో మాకు సోర్స్ దొరకలేదు.
ఇక నేను చిన్నా పెద్దా బ్రాండ్స్ అన్నీ ప్రయత్నించాను. కానీ నాకు ఏది కనబడలేదు. కనుక్కోలేకపోయాను. ఈ మూడేళ్లలో ఎన్నో రకాల గ్లాసులను వాడాను. కానీ ఏ ఒక్కటి కూడా నా హృదయానికి దగ్గరగా రాలేదంటూ తన కళ్లద్దాల పురాణాన్ని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు.
అల్లు శిరీష్ లాక్ డైన్‌లో ఎన్ని కష్టాలు పడ్డాడ్డో అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో ఆలస్యమవుతూ వస్తోన్న తన కొత్త ప్రాజెక్ట్ కరోనా వల్ల మొత్తానికే వాయిదా పడింది. మరికొత్త ప్రాజెక్ట్ సంగతులు ఎప్పుడు చెబుతాడో చూడాలి.