అల్లు వారబ్బాయి శిరీష్ గురించి, ఆయన చేసే సినిమాల గురించి, సరైన సక్సెస్ కోసం కష్టపడేతత్త్వం గురించి అందరికీ తెలిసిందే. బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే ఓ కమర్షియల్ హిట్ కోసం ఇంకా పరితపిస్తూనే ఉన్నాడు. చివరగా ఓ మలయాళీ రీమేక్‌తో ఏబీసీడీ అనే చిత్రంతో పలకరించినా సక్సెస్ కొట్టలేకపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన అల్లు శిరీష్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇక అన్నీ మరిచిపోయి మళ్లీ ఓ కొత్త ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకొని సెట్స్ మీదకు వెళ్దామంటే కరోనా అడ్డుతగిలింది.
మామూలుగా ఓ ప్రాజెక్ట్ రెడీ అయిందని, వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అప్పట్లో ప్రకటించాడు. అయితే కరోనా, లాక్‌డౌన్ వంటివి రావడంతో అన్నీ అటకెక్కాయి. అల్లు శిరీష్ ఓ ఇంట్లో మూలన పడ్డాడు. క్వారంటైన్, లాక్ డౌన్ మొత్తాన్ని ఒంటరిగానే గడిపాడు. ఆ రోజులు ఎంత కష్టంగా ఉన్నాయి, బ్యాచ్‌లర్‌గా ఉండటం ఎంత కష్టమైన పనో చెబుతూ ఎన్నో వీడియోలను షేర్ చేశాడు. ఇక తినడం, పండుకోవడం, ఆడుకోవడం తప్పా మరొకటి లేకపోవడంతో పిచ్చి లేస్తోంది తెగ వాపోయాడు.
తాను బయటకు వెళ్లి 221 రోజులు అవుతోందని తన బాధను బయటకు చెప్పాడు అల్లు శిరీష్. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లి 221 రోజులు అవుతున్నాయి. మార్చ్ 1 నుంచి 3 వరకు ముంబైకి ఓ వర్క్ షాప్ కోసం వెళ్లాను. అదే చివరిది. షూటింగ్స్ మిస్ అవుతున్నా. పని, ప్రయాణం, ఎయిర్‌పోర్ట్ ఇలా అన్నీ మిస్ అవుతున్నాను. మీరు మీ ఇంటిని వదలక ఎన్ని రోజులు అవుతోంది అంటూ నెటిజన్లను ప్రశ్నించాడు. నిత్యం ప్రయాణాలు, విదేశాలు చుట్టి వచ్చే వారికి ఇంట్లోనూ కూర్చొబెడితో ఇలా రోజులు లెక్కబెట్టుకుంటూ బాధతో కాలం గడిపేస్తుంటారేమో కదా.