అల్లు కుటుంబం నుండి హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందగా మరొక హీరో అల్లు శిరీష్ కూడా మంచి సినిమాలలో నటిస్తూ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత “ఊర్వశివో రాక్షసివో” అనే సినిమా ద్వారా అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు శిరీష్, అను ఇమాన్యుల్ జంటగా నటించారు. ఇక ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ , అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్
ఈ సినిమాని నిర్మించాడు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్.. సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. నవంబర్ 4వ తేదీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లో ఒక స్టార్ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు ఈ సినిమాకి కథ అందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ కి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఈ సినిమాలో శిరీష్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా తన నటనతో ఆకట్టుకుంటాడు. జూబ్లీహిల్స్ కుర్రాన్ని మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూయించాలి అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూసిన వారందరూ కూడా సినిమా బాగుందని మెచ్చుకున్నారు. సినిమా చూసిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ఫోన్ చేస్తుంటే సినిమా బాగా తీయలేదేమో అని కంగారు పడి ఆయన ఫోన్ తీయటానికి భయపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఆయన ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పటంతో చాలా సంతోషంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.