పుష్ప : చరిత్ర తిరగరాసిన అల్లు అర్జున్..!

గత 2021 సంవత్సరంలో టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో కరోనా భయంతోనే డేరింగ్ స్టెప్ వేసినవి చాలా ఉన్నాయి. మరి అలా వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా ఎమెర్జ్ అయ్యిన పాన్ ఇండియా చిత్రం మాత్రం “పుష్ప 1”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఆ ఏడాదికి ఇండియన్ సినిమా దగ్గరే హైయెస్ట్ గ్రాసర్ గా 350 కోట్లకి పైగా వసూళ్లతో అయితే నిలిచింది.

మరి ఈ సినిమాతో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లేటెస్ట్ గా జాతీయ స్థాయి సినిమా వారు నేషనల్ అవార్డ్స్ ని ప్రకటించగా ఈ అవార్డ్స్ లో అయితే మన టాలీవుడ్ నుంచి అలాగే ఇండియా వైడ్ గా కూడా ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ విన్నర్ గా నిలిచాడు. దీనితో అల్లు అర్జున్ ఈ 69 ఏళ్ల జాతీయ అవార్డ్స్ చరిత్రలో మొట్ట మొదటిసారిగా నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా నిలిచి హిస్టరీ అయితే క్రియేట్ చేసాడు.

మరి తాను ఒక్కడే కాకుండా ఈ చిత్రం నుంచి పలు విభాగాల్లో కూడా అవార్డ్స్ వచ్చాయి. సినిమా పాటలకి గాను దేవిశ్రీ ప్రసాద్ కి కూడా అవార్డు వచ్చింది. దీనితో ఇలా పుష్ప మేకర్స్ నేషనల్ అవార్డ్స్ లో అదరగొట్టగా ఈ ఆనందాన్ని అల్లు అర్జున్ తన టీం అండ్ తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి జరుపుకున్నాడు. దీనితో ఈ పిక్చర్స్ మరియు వీడియోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.