అల్లు అర్జున్ కి విలన్ తయారయ్యాడు.. పాన్ ఇండియన్ సినిమా అంటే ఆ విలన్ ఉండాల్సిందే ..?

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, రజనీకాంత్ దర్బార్ తో పోటీ పడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డ్ ని సాధించింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న పాన్ డియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్… రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమా 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించాడు అల్లు అర్జున్.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie  News - Times of India

కొరటాల ఆచార్య కంప్లీట్ అవగానే అల్లు అర్జున్ సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నారు. ఈ రెండు సినిమాలకి మ్యూజిక్ విషయంలో అల్లు అర్జున్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడని సమాచారం. పుష్ప సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్, కొరటాల తో చేయబో సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ.. సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకి అద్భుతమైన ఆల్బం తయారు చేయమని అల్లు అర్జున్ ప్రత్యేకించి చెప్పినట్టు సమాచారం.

Prakash Raj Lifestyle, Height, Wiki, Net Worth, Income, Salary, Cars,  Favorites, Affairs, Awards, Family, Facts & Biography - Topplanetinfo.com |  Biography of Famous People

కాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకి పర్‌ఫెక్ట్ గా ఫారెస్ట్ సీన్స్ తెరకెక్కించడానికి దట్టమైన అడవులు ఎలా అయితే సెట్ కావడం లేదో అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక పవర్ ఫుల్ విలన్ రోల్ కి ఇన్నాళ్ళు సరైన నటుడు దొరకలేదు. నారా రోహిత్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఇలా చాలా పేర్లు ప్రచారంలో నలిగాయి తప్ప విలన్ రోల్ మాత్రం ఫైనల్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు పుష్ప లో ఉన్న ఆ పవర్ ఫుల్ పాత్రకి .. అల్లు అర్జున్ కి ధీటైన విలన్ గా ప్రకాశ్ రాజ్ ని ఫైనల్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమమాచారం.