రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీశాడో కానీ అప్పటినుంచి పాన్ ఇండియా మూవీస్ హవా పెరిగిపోయింది. సినిమాలో కంటెంట్ ఉన్నా, లేకపోయినా తీసిన ప్రతి సినిమాని పాన్ ఇండియాలో చూపించాలనుకుంటున్నాడు ప్రతి దర్శకుడు. అయితే కొన్ని సినిమాలు హిట్ అవుతున్నప్పటికీ మరికొన్ని సినిమాలు మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూస్తున్నాయి. అయితే ఈ ఏడాది తమిళంలో కొన్ని పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయ్యాయి అయితే అనుకున్నంత సక్సెస్ సాధించలేదు సరి కదా ఘోరపరాజయాన్ని చవి చూసాయి.
అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. భారీ అంచనాల మధ్య విడుదలైన కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇండియన్ 2. ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ మూట కట్టుకుందో అందరికీ తెలిసిందే తాత వచ్చాడే, ప్రేక్షకులను ఇరగదీసిపోయాడు అంటూ సినిమాని విపరీతంగా ట్రోల్స్ చేశారు ఫ్యాన్స్. వాళ్ళు అలా ట్రోల్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు ఎందుకంటే ఉన్నదే చిన్న కథ, దాన్ని జీడి పాకంలా సాగదీసి సినిమా మొత్తం చూపించాడు శంకర్. ఇక ఘోర పరాజయం పొందిన మరొక తమిళ సూపర్ హీరో మూవీ ద గోట్.
ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ అందరి అంచనాలని తలకిందులు చేసింది. తమిళంలో తప్పితే ఈ సినిమా మిగిలిన భాషలలో ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది. అలాగే దేశవ్యాప్తంగా స్టార్ హీరో హోదా దక్కించుకున్న రజనీకాంత్ సినిమా కూడా పాన్ ఇండియా వైట్ గా ఘోర పరాజయాన్ని పొందింది. ఆయన హీరోగా నటించిన వేట్టయాన్ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.
ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమే. ఎంత పెద్ద యాక్టర్ అయినా సరియైన కంటెంట్ లేకపోతే మూవీని ఆదరించరు అని మరొకసారి నిరూపించారు మూవీ లవర్స్. ఇక కంగువా సినిమాతో హీరో సూర్య కూడా పాన్ ఇండియా వైడ్ గా సినిమాని రిలీజ్ చేశాడు కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్ మూవీ కనీసం తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించలేకపోయింది.