ప్రస్తుతం తమిళ నటుడు సూర్య చేస్తున్న సినిమాలను చూస్తుంటే అతను పని గురించి తప్ప హిట్స్, ఫ్లాప్స్ మీద దృష్టి పెట్టడం లేనట్లు కనిపిస్తుంది. వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న సూర్య ఈ మధ్యనే కంగువ సినిమాతో మనందరి ముందుకే వచ్చాడు. సినిమా దద్దరిల్లిపోతుంది అంటూ మూవీ మేకర్స్ హైప్ బాగానే ఇచ్చారు కానీ ఈ సినిమా ప్రజలని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే ఈ సినిమాపై సూర్యతో పాటు మూవీ యూనిట్ మొత్తం మంచి హోప్స్ పెట్టుకున్నారు, జనాలకి కూడా ఆ విధంగానే ఎలివేషన్ ఇచ్చారు. కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది అయితే పని తప్ప మరి ఏమి ఆలోచించని సూర్య ఫెయిల్యూర్ కి కృంగిపోకుండా మరొక సినిమాతో మన ముందుకి వస్తున్నారు. కంగువా షేడ్స్ చెరిపేయడానికి ఫిక్స్ అయిన సూర్య కంగువ నచ్చకపోతే మీకోసం రెట్రో రెడీగా ఉంది అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.
సూర్య 44 వర్కింగ్ టైటిల్ తో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే క్రిస్మస్ రోజు ఈ సినిమా టీజర్ టైటిల్ ని చిత్ర బృందం విడుదల చేసింది. సినిమాకి రెట్రో అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే టీజర్ లో సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపించి అందరినీ అలరించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది. కాగా సూర్య ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నట్లు సమాచారం.
కాశీ ఘాట్ లో సూర్య పూజ మధ్య జరిగే సీన్ అందర్నీ ఆకట్టుకుంటుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వెంటనే ఆర్జే బాలాజీ తో మరో సినిమాకి కమిట్ అయిపోయాడు సూర్య. వీటన్నిటి తర్వాత లోకేష్ కనకరాజు తో కలిసి రోలెక్స్ క్యారెక్టర్ కి రూపు దిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు సూర్య. ఫలితాలు ఆశించకుండా పనిచేయటం మీదే దృష్టి పెట్టిన సూర్య నిజంగా గ్రేట్.