Aliya Bhatt :కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా నుంచి ఆలియా తప్పుకుందా..?

Aliya Bhatt : ఆర్ఆర్ఆర్ సినిమా తో సౌత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ బాలీవుడ్ భామ ఆర్ఆర్ ఆర్ సినిమా విడుదలయ్యాక దర్శకుడు రాజమౌళి పైన గుర్రుగా ఉందని సమాచారం. సినిమాలో తన పాత్ర కీలక మైనదైన నిడివి తక్కువగా ఉండటంతో అసంతృప్తికి లోనైంది. దీంతో ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళి అన్ ఫాలో చేసిందంటు , ఆర్ఆర్ఆర్ కి సంబందించిన అప్ డేట్స్ ను కూడా డిలీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలో ఆమె పట్టుమని పదినిమిషాలు కూడా కనిపించకపోవడంతో బాలీవుడ్ లో ని ఆమె అభిమానులు హర్ట్ అయ్యారట. ఆమె అభిమానులే కాదు సినిమా చూసిన జనాలకు అదే అనిపించింది. అలియా స్క్రీన్ టైం కొంచెం పెంచుంటే బాగుండేది అని. కానీ, నిజానికి ఈ సినిమాలో అలియా, చరణ్ తో కొన్ని సీన్స్ ఉన్నాయట, కానీ..సినిమా నిడివి ఎక్కువ అవుతుండటంతో అవి ఎడిట్ చేశారట. అది కూడా అలియా కి చెప్పకుండానే ఈ సినిమాలో ఆమె కు సంబంధించిన సీన్స్ తీసేయ్యడం పట్ల ఆమె కోపంగా ఉందని తెలుస్తుంది.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అలియా మరో తెలుగు సినిమా నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. తారక్ కొరటాల డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. అన్ని కరెక్ట్ గా ఉంటే మే నెలలో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఎండలు ఎక్కువుగా ఉండటంతో తారక్ షూటింగ్ పోస్ట్ పోన్ చేశారట. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా ఫిక్స్ అయ్యిన్నట్లు టాక్ వినిపించింది.

అలియా కూడా ఓ ఇంటర్వ్యుల్లో ఈ తారక్ పక్కన నటిస్తున్నా అని ధ్రువీకరించింది . కానీ, ఇటీవల జరిగిన ఇష్యూతో అలియా ఇక పై తెలుగులో సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యారట. అందుకే ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి దీని పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో ..?