Aliya Bhatt : సందడిగా ఆలియా, రణ్ బీర్ పెళ్లి…. పెళ్లయ్యాక మీడియా ముందుకు కొత్త జంట…..!

Aliya Bhatt : బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ తో మొదలైన పరిచయం ప్రేమగా మారి ఇపుడు పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా రణ్ బీర్ కపూర్.2017 లో ప్రారంభమైంది వీరి పరిచయం, ప్రేమ, 2018 నాటికీ అధికారికంగా ప్రకటించేసారు మీడియాకు వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నామని. ఇక 2020 లోనే వీరిద్దరూ ఒక్కటవ్వాల్సింది.

కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇక ఇపుడు అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి వివాహం సింపుల్ గా ఏప్రిల్ 14 న చేసుకున్నారు. ముంబై లోని బాంద్రా లో వాస్తు అపార్ట్‌మెంట్ ఈ వేడుకకు వేదికయింది. అంతకుముందు ఆలియా ఇంట్లో మెహందీ ఫంక్షన్స్ చాలా గ్రాండ్ గా సందడిగా చేసారు. ఇందుకు కరిష్మా కపూర్ తన కుటుంబం తో హాజరయ్యారు.

ఇక రణ్ బీర్ కపూర్ సోదరి రిద్దిమా కపూర్,కరిష్మ కపూర్ తమ మెహందీ డిజైన్ ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఇక ఏప్రిల్ 14న వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.ఇక వివాహం అనంతరం మీడియా ఎదుటకు వచ్చిన కొత్తజంట ఫోటోలకు పోజులు ఇచ్చారు.ఇక రణ్ బీర్ ఆలియా ఎత్తుకుని తీసుకెళ్లడం అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో ఇపుడు సోషల్. మీడియాలో వైరల్ అయింది.