Aamir Khan: మహాభారతం కలల వెనక అమీర్ ఖాన్ ప్లాన్ ఏంటి?

ఇటీవల బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో మహాభారతం ప్రస్తావన తప్పనిసరిగా వస్తోంది. కర్ణుడి పాత్రను హైలైట్ చేస్తూ సినిమా తీయాలి, కృష్ణుడి పాత్ర నాకు ఇష్టం, అంటూ ఆయన మాటలు మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని పదే పదే చెబుతున్నా, ఈ మాటలు వాస్తవానికి గుణాత్మకంగా దృష్టి పెట్టితే అసలు మరో ఉద్దేశం ఉందేమోనని అనిపిస్తోంది.

అమీర్ ఖాన్ ప్రస్తుతం తన కొత్త చిత్రం సితారే జమీన్ పర్పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. జూన్ 20న విడుదలవుతున్న ఈ యూత్ ఎమోషనల్ డ్రామా తనకు తిరిగి పూర్వ గౌరవాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయి బజ్ లేకపోవడం, మాస్ ఆడియన్స్‌కు ఇది పెద్దగా కనెక్ట్ కావడం కష్టం అనే అభిప్రాయం పరిశీలకుల్లో ఉంది. గతంలో లాల్ సింగ్ చద్దా విఫలమయ్యిన తర్వాత అమీర్ మార్కెట్ స్థాయి కొంత తగ్గింది.

ఈ నేపథ్యంలో మహాభారతం ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం పక్కా ఒక ప్రచార వ్యూహం అనిపిస్తోంది. రణబీర్ కపూర్ ప్రస్తుతం రామాయణంలో బిజీగా ఉన్నాడు, దానికి సంబంధించిన హైప్ బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది. అందులోకి అమీర్ కూడా తన మహాభారతం కలలను బయటపెట్టి మీడియా స్పాట్‌లైట్ తనపై పడేలా చూస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఈ స్థాయి ప్రాజెక్ట్‌ను తీయడానికి ఇప్పటి వరకు ఎందుకు వెనుకాడాడో అర్థం చేసుకుంటే, అమీర్ చెప్పినంత తేలిగ్గా ఇది సాధ్యపడదని స్పష్టమవుతుంది. ఆఖరికి ఇది నిజంగా తెరపైకి వస్తుందా, లేక అమీర్ ఒక్కటే మాటల్లో జిమ్మిక్స్ ఆడుతున్నాడా అన్నది ఇప్పట్లో చెప్పలేం. అభిమానులూ ఇదే అనుమానంగా చూస్తున్నారు.

తిండి కోసం గిన్నెలు కడిగే దాన్ని | Transgender Shashirekha Struggle Life | Telugu Rajyam