Aliya Bhat – Ranabeer: భాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆమెకు ఆమే సాటి అంటూ నిరూపిస్తోంది. అగ్ర హీరోల సరసన నటిస్తూ ఇప్పటికే ఆమెకంటూ ఓ స్టార్‌డం స్థాయి కెరీర్‌ను డెవలప్ చేసుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక ఈ మధ్య భారీ బడ్జెట్‌తో రాజమౌళి సినిమాలోనూ ఆలియా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో మరోసారి ఆమ తన టాలెంట్‌ను నిరూపించుకుంది.
అంతే కాకుండా రణ్‌భీర్‌తో ప్రేమ వివాహం జరుగుతుందన్న వార్త కూడా ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ జంట ఒక్కటవుతున్నారంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఎంతో కాలమైనా పెళ్లికి మాత్రం చాలా సమయమే పట్టింది. గత రెండేళ్ల క్రితమే వీరి వివాహం కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక మళ్లీ ఇప్పుడు వీళ్ల పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది.
అయితే వీరిద్దరి వీరిద్దరి ప్రేమకు సంబంధించి ఇప్పుడు మరో వార్త హల్‌చల్ చేస్తోంది. రణ్‌భీర్‌తో ఆలియా ఇప్పుడు కాదు ఆమె చిన్న వయసులో ఉన్నపుడే అతనితో ప్రేమలో పడిపోయిందట. వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం అంటూ ఆలియా చెప్పుకొచ్చింది. బ్లాక్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో తాను కూడా అక్కడికి వెళ్లానన్న ఆలియా, అక్కడే ఉన్న రణ్‌భీర్ ను చూడగానే ఇష్టం ఏర్పడిందట. అప్పటి నుంచి అతనంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది ఈ ముద్దు గుమ్మ. ఈ నేపథ్యంలోనే రణ్‌భీర్ పలువురితో ప్రేమ ప్రయాణం కొనసాగించినా, అవన్నీ పట్టించుకోకుండా తాను ఇష్టపడ్డ అతనితోనే ఉండడానికి సిద్ధమైందనట ఈ భామ. ఇంతకీ చిన్నతనంలో ఆలియా, రణ్‌భీర్‌ను చూసినపుడు ఆమె వయసెంతో తెలుసా… పదకొండేళ్లట.