దర్శకధీరుడు రాజమౌళి సినిమాలంటేనే ఆలస్యమవుతుంటాయి. అలాంటి రాజమౌళికి ఆర్ఆర్ఆర్ పెద్ద సమస్యగా మారింది. అసలే ప్రతీ సీన్‌ను చెక్కుతూ ఉండే జక్కన్నకు కరోనా వైరస్ పెద్ద దెబ్బ కొట్టింది. కరోనా రాకముందే సినిమా షూటింగ్ ఆలస్యమైంది. 2020 జూలై 30న అని ఎప్పుడో ప్రకటించాడు. కానీ హీరోలకు గాయాలు, ఇతర కారణాలతో ప్రతీసారి షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అలా వాయిదా పడుతూ ఉన్న ఆర్ఆర్ఆర్‌ను కరోనా కాటు వేసింది.
ఇక కరోనా ప్రభావం ఆర్ఆర్ఆర్‌పై గట్టిగానే పడింది. ఈ సినిమాకు కేటాయించిన అందరి డేట్స్ వ్యర్థమయ్యాయి. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి గుప్పిట్లోనే ఉంటారు. రాజమౌళి ఆదేశం ఇస్తే తప్పా.. మరో చిత్రాన్ని ఒప్పుకోరు. కాబట్టి వీరిద్దరి విషయంలో ఎలాంటి సమస్య రావడం లేదు. ఎటొచ్చి సీత పాత్రను పోషించబోతోన్న అలియా భట్ విషయంలో గందరగోళం నెలకొంది. ఒక వేళ కరోనా రాకపోతే మార్చి, ఏప్రిల్ నెలలో అలియా భట్ షూటింగ్‌లో జాయిన్ అయ్యేది.
అలియాతో షూట్ చేయాలని చూసిన ప్రతీసారి ఏదో అడ్డంకి వస్తూనే ఉంది. ఇక హిందీలోనూ అలియా చేతినిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అందుకే ఆమె డేట్స్ మాత్రం అడ్జస్ట్ కావడం లేదట. అందుకే ఇప్పుడు అలియా కండీషన్లు పెడుతోందట. అక్టోబర్ నుంచి డేట్స్ ఇస్తానని చెప్పిందట. డిసెంబర్ లేదా జనవరికి తన పార్ట్‌ను పూర్తిచేయాలని తెలిపిందట. అయితే రాజమౌళి మాత్రం ముందు ఎన్టీఆర్ సీన్స్ తీసి.. టీజర్ రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ అలియా ఇలా కండీషన్లు పెట్టి ఇరుకున పెట్టేసింది.