Alia – Ranbhir: బాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న అంశం ఆలియా – రణబీర్ పెళ్ళి. వారి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఫ్యాన్స్ గత కొంత కాలం నుంచీ ఎదురు చూస్తూనే ఉన్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన వారి పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే వారిరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి సంబంధించిన షాపింగ్ , వివిధ పనుల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇక ప్రేమాయణం తర్వాత వీరి వివాహానికి ఇద్దరి తరపు పెద్దలు ఒకే చెప్పడం, ఇప్పుడు పెళ్లికి ముహూర్తం కూడా సిద్ధం కావడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే వీరి పెళ్లి ఏప్రిల్ 14 వ తేదీన జరుగనున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సెలబ్రిటీలు, సన్నిహితులు వస్తారని సమాచారం. కాగా ఈ పెల్లికంటే ముందుగా రిషి కపూర్ కు ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం. చెంబూర్ లోని ఆర్కే హౌజ్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం పెళ్లికి సంబంధించిన పనులు కార్యక్రమాలు మొదలు కానున్నాయి.
ఇకపోతే ఏప్రిల్ 30, 2020న రిషి కపూర్ మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆయన్ని తమ ఫ్యామిలీ మిస్ అవుతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో రణ బీర్ కపూర్ తెలిపారు. ఆయన ఎంత కఠినంగా ఉంటారో, అంతే ప్రేమిస్తారని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్కే హౌస్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆలియాతో పాటు తమ బంధువులు, స్నేహితులు కూడా హాజరవుతారని రణబీర్ వెల్లడించారు. దీంతో పాటు ఏప్రిల్ 13న నుంచి పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఇక పెళ్లి అనంతరం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక వెడ్డింగ్ కోసం ఇప్పటికే ఆర్కే హౌస్ ముస్తాబయింది. దీనికోసం భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.