టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందలకు పైగా సినిమాలలో కమెడియన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆలీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆలీ సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న టీవీ ఛానల్ లో కూడా సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల తరఫున ఆలీ చురుకుగా పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ విజయానికి తోడ్పడిన ఆలీకి…జగన్ సీఎం కాగానే ఓ కీలకమైన పదవి ఇస్తారనే టాక్ వచ్చింది. ఇలా గత మూడు సంవత్సరాలుగా రాజ్యసభ పదవి అని కొంతకాలం ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మూడు సంవత్సరాలకు తాజాగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా జగన్ ప్రభుత్వంలో ఆలీకి చోటు కల్పించాడు. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు అలీ. ఈ పదవికి సంబంధించి అలీ జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి మరోసారి ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు.
జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా పదవి దక్కించుకున్న ఆలీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో అలీ మాట్లాడుతూ..”నేను వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే జగన్‌కు నా ఉద్దేశాన్ని స్పష్టం చేశాను. నేను పదవుల కోసం పార్టీలోకి రాలేదన్న విషయాన్ని ఆయనకు స్పష్టం చేశాను . గతంలో కూడా నా పదవి గురించి వచ్చిన వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాను. అయితే నా గురించి జగన్‌కు తెలుసు. అందుకు నిదర్శనమే ఈ పదవి. ఈ పదవి జగన్ నా కూతురి పెళ్లికి ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను’ అంటూ అలీ ఎమోషనల్ అయ్యాడు.