Ali : చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన టాలీవుడ్ సీనియర్ నటుడు అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అనతి కాలంలోనే పాపులర్ అయ్యి, అటు తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్నాడు.ఎప్పుడూ కూడా తన మూలాలను ఆయన మరిచిపోలేదు. ‘సీతాకోకచిలుక’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలీ….1100 కి పైగా సినిమాల్లో నటించారు. ఒకానొక టైంలో హీరోగా వరుస సినిమాలు చేసినప్పటికీ తాను ఫస్ట్ నుంచి చేస్తూ వచ్చిన కమెడియన్ వేషాలు పోకుండా చూసుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే మరోపక్క టీవీ వ్యాఖ్యాతగా బుల్లితెర పై కూడా సందడి చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన నటించారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలీ తండ్రి మహమ్మద్ బాషా పేరుపై చారిటబుల్ ట్రస్ట్ ను కూడా స్థాపించి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.ఇక అలీకి ముగ్గురు పిల్లలు .. వాళ్లను ఒక శ్రీమంతుడి పిల్లల లాగా కాకుండా కష్టం విలువ తెలిసేలా అలీ పెంచారని అంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా. తన వైపు బంధువర్గంలో ఎవరూ కూడా డాక్టర్ చదువు చదవలేదు. అందువలన తన పెద్ద కూతురును డాక్టర్ ను చేయాలని అలీకి కోరికగా ఉండేదట.
ఫాతిమా కూడా తన తండ్రి కలను నిజం చేయాలానే ఉద్దేశంతో ఎంతో పట్టుదలతో ముందుకు వెళ్లింది. అలా మొత్తానికి ఆమె డాక్టర్ అయ్యి తన తండ్రి కలను సాకరం చేసింది. తన కూతురి ద్వారా అలీ కోరిక తీరినట్టు ఆనందాన్ని వ్యక్తం చేశారు అలీ. తమ కుటుంబంలో ఫస్ట్ డాక్టర్ ఫాతిమా అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.తన తండ్రి కలను నిజం చేసిన ఫాతిమాకు నెటిజన్స్ అందరూ కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు.