ఇండస్ట్రీలో వంద కోట్ల స్టామినా మేల్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకే ఉంటుందా? అంటే, వెంటనే ‘యస్’ అనే మాట వినిపిస్తుంది. స్టోరీలో సత్తా ఉంటే, ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలూ ఆ రేంజ్‌లో కలెక్ట్ చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. కథల మీదా, కమర్షియల్ సక్సెస్ మీద, ప్రేక్షకాదరణ మీదా ఉన్న నమ్మకంతోనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకూ సీక్వెల్స్ సిద్ధం చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారన్నది వారి మాట. ‘భామా కలాపం’ చూసిన వారందరూ ఎక్సలెంట్ రైటింగ్ అని మెచ్చుకున్నారు. ప్రియమణికి టైలర్ మేడ్ కేరక్టర్ అన్నారు.
అందుకే ఆహా ఓటీటీలో అద్భుతమైన సక్సెస్ అందుకుంది ‘భామా కలాపం’. ఆ సినిమాకు వచ్చిన స్పందన చూసిన మేకర్స్ వెంటనే సీక్వెల్ మీద ఫోకస్ చేశారు. ‘బామా కలాపం2’ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ప్రమోషనల్ కంటెంట్‌లో ప్రతి డైలాగూ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది… ఆహాలో ఈ నెల 16న విడుదల కానుంది ‘బామా కలాపం2’. అంజలి హీరోయిన్‌గా నటించిన ‘గీతాంజలి’. హారర్ జోనర్‌లో ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు అదే జోనర్‌ని కంటిన్యూ చేస్తూ ఆమె నటిస్తున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఈ సారి ఈ కథలో ఇంకేం ఎలిమెంట్స్ ని పొందుపరుస్తారోననే ఆసక్తి ఈ జోనర్ లవర్స్ లో బాగానే కనిపిస్తోంది. ఈ మధ్య రీఎంట్రీలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మంచి హిట్ అందుకున్నారు అనుష్క. ఆమె నటించిన ‘భాగమతి’కి సీక్వెల్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఓ మలయాళ షూటింగ్‌లో ఉన్నారు అనుష్క శెట్టి. అది పూర్తికాగానే ‘భాగమతి’ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతారన్నది ఫిల్మ్ నగర్ న్యూస్.
ఇటు సమంత కూడా ‘ఫ్యామిలీమేన్3’కి ప్రిపేర్ అవుతున్నారు. వెబ్ సీరీస్ పరంగానే కాదు, సినిమాల పరంగానూ ఆమె ఖాతాలో ఓ సీక్వెల్ ఉంది. మయోసైటిస్ సోకడానికి ముందు ఆమె నటించిన యశోద. ఈ సినిమా కు సీక్వెల్ చేసే ఆలోచనలున్నాయని గతంలో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సమంత కమ్‌బ్యాక్ టైమ్‌లో ఆ ప్రాజెక్టు మీద కూడా హోప్స్ పెంచుకుంటున్నారు సామ్ ఫ్యాన్స్!