Akkineni Akhil : జెట్ స్పీడ్ గా ఏజెంట్ సినిమా షూటింగ్… వైజాగ్ లో ఘన స్వాగతం పలికిన అభిమానులు….!

Akkineni Akhil : అక్కినేని ఇంట వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన అఖిల్ ఇంతవరకు ప్రేమ కథలు చేసాడు కానీ ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమాలో చేయలేదు. ఇక ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పూర్తిగా యాక్షన్ సినిమాలో చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ను అఖిల్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీ అయ్యారు.

అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. తాజాగా ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో మొదలైయింది.షూటింగ్ లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్ కు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

అఖిల్ ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు బైక్ భారీ ర్యాలీ కూడా నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు. అభిమానులు నుంచి వస్తున్న ఈ భారీ స్పందన అఖిల్ కి వున్న క్రేజుకి అద్దం పడుతుంది. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు.