మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ .. సోలోగా రానున్న ‘అఖిల్’ అయ్యగారు !

కెరియర్ మొదలుపెట్టినప్పటి నుండి వరసగా మూడు పరాజయాల తర్వాత బాక్సాపీస్ పైకి మరోసారి దండయాత్రకు సిద్దమౌతున్నాడు అఖిల్. ఈయన తాజాగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాపై ముందు నుంచి కూడా ఆసక్తి బాగానే ఉంది. వరస ఫ్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ను నమ్మి నాగార్జున, అల్లు అరవింద్ ప్రాజెక్ట్ ఇచ్చారంటే సినిమాలో ఎంత దమ్ము ఉందో అని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాను ప్రకటించిన రోజు నుంచే ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌థ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ పోస్టర్‌లో అక్కినేని అందగాడు అఖిల్ మరింత స్టైలిష్‌గా ఉన్నాడు. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు