అతనేమీ సినీ ప్రముఖుడు కాదు.! కానీ, సినీ వ్యవహారాలో గట్టిగా తల దూర్చేస్తున్నాడు. హీరోయిన్ల మార్పు సహా, కాంబినేషన్లను చెడగొట్టడం చాలానే చేస్తున్నాడట. ఎవరు.? అంటే, సినిమా సెలబ్రిటీ అయితే కాదు, కానీ సినీ రంగంతో టచ్‌లో వున్నోడే.
ఆ మధ్య ఓ యంగ్ హీరో సీరియస్‌గా ఈయనకి వార్నింగ్ ఇచ్చాడు. కొన్నాళ్ళ క్రితం కమెడియన్, నిర్మాత కూడా అయిన ఒకాయన చాకిరేవు పెట్టేశాడు. అన్నీ తడుచుకుపోవడం ఆయనకి అలవాటే.
లేటెస్టు గాసిప్ ఆ ‘వ్యక్తి’ గురించి ఏమని ప్రచారంలో వుందంటే, ఓ యంగ్ హీరో మీద మనసు పారేసుకున్నాడట. ‘నాకు అందరు తెలుసు, నీకు నేను లైఫ్ ఇస్తా..’ అని తిరుగుతున్నాడట.
వేరే ఉద్దేశ్యంతోనా.? అంటే, ఏమో.. ఆ వయసుకి అంత సీన్ వుండకపోవచ్చు. కాకపోతే, గట్టిగా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడట. ఈ వ్యవహారంపై సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
ఈ వయసులో ఆమె అందాన్ని పొగడుతూ, సోషల్ మీడియాలో వెకిలి రాతలేంటో.. అంటూ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ హీరోయిన్ కొన్నాళ్ళ క్రితం ఓ మీడియా పర్సనాలిటీ కారణంగా ఇబ్బంది పడింది లెండి.!