Nagarjuna: నటుడు అల్లు అర్జున్ ఇటీవల అరెస్టయిన విషయం మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయన అరెస్టును తీవ్రంగా తప్పుపట్టారు. అయితే మద్యంతర బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రిటీలు మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక హైదరాబాద్లో లేనటువంటి ప్రభాస్ ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా ఫోన్ కాల్ ద్వారా అల్లు అర్జున్ తో మాట్లాడారని తెలుస్తోంది.
ఇలా యంగ్ హీరోల నుంచి మొదలుకొని సీనియర్ హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి ఆయనని పరామర్శించారు. అయితే హైదరాబాద్ లోనే ఉన్నటువంటి నాగార్జున మాత్రం అల్లు అర్జున్ ని కలవడానికి వెళ్లలేదు దీంతో అసలు నాగార్జున ఎందుకు అల్లు అర్జున్ ని కలవడానికి వెళ్లలేదు అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దీంతో కొంతమంది గతంలో ఒక హీరోయిన్ కారణంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని అందుకే నాగార్జున అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లలేదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి వీరి మధ్య అలాంటి అభిప్రాయ భేదాలు ఎక్కడా లేవని చెప్పాలి అల్లు అరవింద్ నాగార్జున ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు ఇటీవల నాగచైతన్య పెళ్లిలో కూడా అల్లు అరవింద్ సందడి చేశారు. ఇక నాగార్జున స్వయంగా అల్లుఅర్జున్ ని కలవకపోయినా ఫోన్ కాల్ ద్వారా తనని పరామర్శించారని తెలుస్తోంది. ఇక నాగార్జున ఫోన్ కాల్ మాట్లాడినప్పటికీ ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనని పరామర్శించిన విషయం మనకు తెలిసిందే.