Home Entertainment సోహెల్ మళ్లీ బుక్కయ్యాడు.. బయటపెట్టిన అఖిల్

సోహెల్ మళ్లీ బుక్కయ్యాడు.. బయటపెట్టిన అఖిల్

బిగ్ బాస్ షోలో స్కామ్ వీడియో రోజు రోజుకి వైరల్ అవుతోంది. దానిపై సోహెల్ , మెహబూబ్ మాట్లాడే వాటికి పొంతన లేకుండా పోతోంది. పైగా అఖిల్ మళ్లీ కొన్ని మాట్లాలు అనడంతో ఓ క్లారిటీ వచ్చింది. చివరి రోజు అఖిల్‌తో మెహబూబ్ సైగల విషయాన్ని ప్రస్థావించానని సోహెల్ చెప్పుకొచ్చాడు. కానీ అఖిల్ మాత్రం వాటికి భిన్నంగా సమాధానాలు చెబుతున్నాడు. మొత్తానికి ఈ వ్యవహారం రోజుకో రకంగా యూటర్న్ తిరుగుతోంది. సోహెల్ మెహబూబ్‌ను స్కాం పేరిట దారుణంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు.

Akhil About Sohel Mehaboob Scam Video
Akhil about Sohel Mehaboob scam video

మెహబూబ్ ఇచ్చిన హింట్ వల్లే సోహెల్ 25 లక్షలు తీసుకు వచ్చాడని ఓ వీడియో చెక్కర్లు కొడుతూనే ఉంది. దానిపై సోహెల్ మెహబూబ్‌లు క్లారిటీ ఇచ్చారు. లైవ్‌లోకి వచ్చి మరీ ఆ ఇద్దరూ విషయంపై నోరు విప్పారు. అవి ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ కోసం చేసిన సైగలు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే అందరికీ అనుమానం మొదలైంది. సోహెల్ ఒకలా.. మెహబూబ్ ఒకలా చెబుతున్నారు. కొన్ని చోట్ల మా పొజిషన్ గురించి అడిగామని, ఇంకొన్ని చోట్ల ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ అంటూ కబుర్లు చెబుతున్నారు.

అయితే మెహబూబ్ చేసిన సైగలు అర్థం కాలేదని, అఖిల్ తాను చర్చించుకున్నామని సోహెల్ చెబుతున్నాడు. కానీ ఇదే విషయాన్ని అఖిల్ అడిగితే..సోహెల్ తనకు ఎన్నడూ కూడా చెప్పలేదని, అసలు ఆ విషయమే తనకు తెలీదని అన్నాడు. వారు ఏం చేసినా నాకు అవసరం లేదు.. డబ్బుల కోసం నేను మాత్రం అలా చేయను.. అలా చేస్తే ఓట్లు వేసిన వారిని కించపరిచినట్టే.. డబ్బులుకావాలంటే ఎలాగైనా సంపాదించవచ్చని అఖిల్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Related Posts

మద్యం మత్తులో షణ్ముఖ్ హల్‌ చల్.. కార్లు, బైకులను ఢీకొట్టి బీభత్సం !

మద్యం మత్తులో టిక్‌టాక్‌ స్టార్ షణ్ముఖ్ హల్‌చల్ సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. జూబ్లీహిల్స్ వుడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు, బైకులను ఢీకొట్టి...

బ‌న్నీ సినిమాకు ఈ కుర్ర భామ నో చెప్ప‌డానికి కార‌ణం ఏంటి?

స్టైలిష్ అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఆయ‌న సినిమాలు హిందీలోను విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాయి. బ‌న్నీ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని...

మెగా హీరోకు అక్కినేని ఫ్యామిలీ స‌పోర్ట్‌.. ఇక ర‌చ్చ రంబోలానే అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యామిలీలు ఎంతో ప్ర‌త్యేక‌మో మ‌నంద‌రికి తెలిసిందే. రెండు ఫ్యామిలీల నుండి చాలా మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, వారు వినూత్న క‌థా చిత్రాల‌తో...

పెళ్ళికి ముందు మొద‌లు పెట్టిన నిహారిక సినిమా మార్చిలో రాబోతుంది..!

మెగా బ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు నిహారిక ముద్దపప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. కొన్ని వెబ్ సిరీస్‌ల త‌ర్వాత ఒక మ‌న‌సు అనే చిత్రంతో వెండితెర డెబ్యూ ఇచ్చింది....

Latest News