లేటెస్ట్ : తెలుగులో ఈ టైటిల్ తో అజిత్ సినిమా రిలీజ్.!

Ajith

తమిళ సినిమా నాట భారీ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి సోషల్ మీడియాకి బాగా దూరంగా ఉండే అజిత్ కుమార్ తన సినిమాలతో భారీ రికార్డులు కూడా సెట్ చేస్తూ ఉంటాడు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు అజిత్ నటించిన మరో చిత్రం అయితే ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ కి రాబోతుంది.

మరి ఈ సినిమానే “తూనీవు” కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వినోద్ తెరకెక్కించాడు. అయితే గతంలో ఈ కాంబినేషన్ లో “వలిమై” అనే సినిమా రాగా దీని తర్వాత వెంటనే చేసిన సినిమా ఇది దీనితో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ కి ప్లాన్ చెయ్యగా ఈ సినిమా తెలుగు లో ఏ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ అయ్యింది. యూఎస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి సమాచారం తో అయితే తూనీవు ని తెలుగులో “తెగింపు” అనే మాస్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు.

దీనితో ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో కూడా మంచి బజ్ తెచ్చుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మంజు వారియర్ కీ రోల్ చేస్తుంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.