బ్రేకింగ్.. డూప్ లేకుండా స్టంట్స్ చేసిన‌ స్టార్ హీరో.. గాయాల‌తో ఆస్ప‌త్రిలో చికిత్స‌

త‌మిళ హీరో అజిత్ అద్భుత‌మైన సినిమాల‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. ఆయ‌న ప్ర‌స్తుతం వాలిమై అనే సినిమా చేస్తున్నాడు. హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీకరిస్తుండ‌గా, అనుకోకుండా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అజిత్‌, చేతికి కాళ్ళ‌కు గాయాలైన‌ట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. అజిత్ యాక్సిడెంట్‌తో చిత్ర బృందం డైల‌మాలో ప‌డింది. కొద్ది రోజులుగా ఆయ‌న‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్ప‌డంతో షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో అర్దం కావ‌డం లేదు.

 అజిత్‌కు బైకులంటే విప‌రీత‌మైన పిచ్చి. బైక్‌పై చేజింగ్ సీన్స్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ ఛేజింగ్ సీన్స్ లో అజిత్ డూప్ లేకుండా నటించాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కంగారు ప‌డ్డారు. సొంత బైకుల‌తో చేజింగ్ సీన్స్ చేస్తున్నాడ‌ని కొద్ది రోజులుగా అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే తాజాగా జ‌రిగిన ప్ర‌మాదంతో అంద‌రు షాక్ అయ్యారు. త్వ‌రగా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు. అజిత్ ప్రొఫెషనల్ బైక్ రేసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ హీరో దగ్గర కార్ల కంటే ఖరీదైన బైక్‌లే ఎక్కువగా ఉంటాయి. అందుకే తన సొంత సూపర్ బైక్‌లను హైదరాబాద్ కు తెప్పించుకుని షూటింగ్ కోసం వాడుతున్నాడట.

అజిత్ బైక్‌ల‌తో సాహ‌సాలు చేయ‌డం కొత్తేమి కాదు. ఈ మ‌ధ్య హైద‌రాబాద్ నుండి చెన్నై వ‌ర‌కు బైక్‌పై ప్ర‌యాణించాడు. కాగా, వాలిమై సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. బోని క‌పూర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. హుమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అజిత్ న‌టించిన చాలా చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. నెర్కొండ పార‌వై సినిమాని ప‌వ‌న్ త్వ‌ర‌లో రీమేక్ చేయ‌నున్నాడు