హిందీలో అజయ్ దేవగన్ హీరోగా భోళా మూవీ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని అజయ్ దేవగన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక తమిళ్ హిట్ మూవీ ఖైదీకి రీమేక్ గా దీనిని తీశారు. అయితే కథలో కొన్ని కీలక మార్పులు కూడా చేశారు. ఖైదీలో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో ఒక హీరోయిన్ పాత్రని కూడా అజయ్ దేవగన్ కోసం పెట్టారు.
అలాగే కాన్సెప్ట్ లో కూడా చాలా మార్పులు చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీ శ్రీరామనవమి సందర్భంగా దియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఊహించని స్థాయిలో ఈ సినిమాకి డిజాస్టర్ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ రావడం లేదు. భోళా సినిమాకి గ్రాండ్ గా ప్రమోషన్ చేశారు.
ఇక ఈ మూవీ టికెట్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఎందుకనో ప్రేక్షకులు మాత్రం చూడటానికి ఏమంత ఆసక్తి చూపించలేదు. దీంతో అజయ్ దేవగన్ కెరియర్ లో డిజాస్టర్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ మూవీకి వచ్చినట్లు తెలుస్తుంది. 10 ఏళ్ళ క్రితం అజయ్ దేవగన్ హిమ్మత్ వాలా అనే సినిమా చేశారు. ఈ మూవీ ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమాకి ఫస్ట్ డే 12 కోట్ల కలెక్షన్ వచ్చింది.
అయితే ఈ రికార్డ్ ని సైతం భోళా సినిమా అందుకోలేకపోయినట్లుగా బిటౌన్ టాక్. నిజానికి ఈ మూవీ ఫస్ట్ డే కచ్చితంగా 16 నుంచి 18 కోట్ల షేర్ రాబడుతుంది అని అంచనా వేశారు. అయితే ఊహించని విధంగా కేవలం 10 నుంచి 11 కోట్ల మధ్యనే షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. సుమారు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.
ఆ స్థాయిలో నిర్మించిన సినిమాకి 10 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ అంటే దారుణం అని చెప్పాలి. ఈ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చిన ఈ మూవీకి బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం ఫుల్ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం విశేషం. మరి ఈ వీకెండ్ లో మూవీ ఏ మేరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అనేదానిని బట్టి సినిమా టాక్ ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.