రోహిత్‌ శెట్టి ‘సింగం అగెయిన్‌’!

రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌ సినిమాలకు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ క్రేజ్‌ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే ప్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘సింగం అగెయిన్‌’. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే షూటింగ్‌ సందర్భంగా కశ్మీర్‌లో సహస్ర సీమా బల్‌ జవాన్లతో అజయ్‌ దేవ్‌గన్‌, రోహిత్‌ శెట్టి టీం దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా సింగం మరోసారి ఆన్‌డ్యూటీలో అంటూ.. అజయ్‌ దేవ్‌గన్‌ షూటింగ్‌ లొకేషన్‌లో దిగిన స్టిల్‌ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. బాజీరావు సింహం.. ఎస్‌ఎస్‌పీ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ జమ్మూ / కశ్మీర్‌ పోలీస్‌..జీతిని త్వరలో వస్తుందని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్వీట్‌ చేసింది. ‘సింగం అగెయిన్‌’ మరో బ్లాక్‌ బస్టర్‌గా రికార్డులు క్రియేట్‌ చేయడం పక్కా అని అజయ్‌ దేవ్‌గన్‌ తాజా లుక్‌ చెప్పకనే చెబుతోంది.

సింగం ప్రాంఛైజీలో వస్తున్న మూడో పార్టు ఇది.ఈ మూవీలో రన్‌వీర్‌ సింగ్‌, అర్జున్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనాకపూర్‌, దీపికాపదుకొనే, అజయ దేవ్‌గన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. దీపికాపదుకొనే పోలీసాఫీసర్‌ గెటప్‌లో యాక్షన్‌ మూడ్‌లోకి వెళ్లిన స్టిల్‌ ఒకటి ఇప్పటికే సోషల్‌ విూడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. రోహిత్‌ శెట్టి ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ ప్రాజెక్ట్‌తో డిజిటల్‌ వరల్డ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. సిద్దార్థ్‌ మల్హోత్రా, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ జనవరి 19న ప్రైమ్‌ వీడియోలో రిలీజైంది.