వింత వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్.. ఆందోళన చెందుతున్న అభిమానులు..!

మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి అందాల తార ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1994 లో ప్రపంచ సుందరిగా నిలిచిన ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఐశ్వర్య రాయ్ నటించిన సినిమాలలో తన నటనకి గాను ఎన్నో అవార్డులు అందుకుంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బజ్జన్ని వివాహం చేసుకొని బచ్చన్ ఇంటికోడలిగా వెళ్ళింది.

పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్యారాయ్ పాప జన్మించిన కొంతకాలానికి మళ్ళి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఐశ్వర్యరాయ్ హాజరైంది.

అయితే ఐశ్వర్యరాయ్ ఈవెంట్ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఐశ్వర్యరాయ్ ఒక వింత వ్యాధితో బాధపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు చల్లటి వస్తువులకు దూరంగా ఉండే ఐశ్వర్య పొరపాటున చల్లని వస్తువులను తినటం లేదా చల్లని నీటిని తాగటం వల్ల చర్మం మీద దద్దుర్లు వచ్చి ఆమె అనారోగ్యం పాడవుతుందని సోషల్ మీడియాలో రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో హాజరైన ఐశ్వర్య పొరపాటున చల్లటి నీరు తాగటం వల్ల చర్మం మీద దద్దుర్లు దొరుకుతా రావటంతో ఈవెంట్ మధ్యలోనే వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.