విడాకులు రద్దు…కొత్త ఇంట్లోకి మకాం మార్చనున్న ఐశ్వర్య ధనుష్ ?

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ధనుష్ ఐశ్వర్య దంపతులు ఈ ఏడాది మొదట్లో విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించారు.2004వ సంవత్సరంలో ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నటువంటి ఈ జంట 18 సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ విషయంపై ఇరువురి కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేసిన వీరి నిర్ణయంలో ఎలాంటి మార్పులు జరగలేదు.

ఇకపోతే వీరిద్దరూ తిరిగి కలుసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నేధనుష్ తండ్రి సైతం తమకు పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పడంతో పిల్లల గురించి ఆలోచించి ఈ దంపతుల విడాకులను రద్దు చేసుకుంటున్నారని తెలుస్తోంది.త్వరలోనే వీరి విడాకుల గురించి అధికారకంగా ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే విడాకుల రద్దు ప్రకటన తెలియజేసిన వెంటనే వచ్చే ఎడాది జనవరి నెలలో ఈ దంపతులు కుటుంబ సమేతంగా కొత్త ఇంట్లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.

ధనుష్ 100 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తన భార్య ఐశ్వర్య పిల్లలతో కలిసి ఈ ఇంట్లోకి వెళ్ళిబోతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ తిరిగి వీరిద్దరూ పిల్లల కోసం కలిసి ఉండబోతున్నారని తెలియడంతో అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే త్వరలోనే ఈ విషయం గురించి ఈ దంపతులు అధికారకంగా తెలియజేయునున్నట్టు సమాచారం.