బాలయ్య పాన్ ఇండియా ఎపిసోడ్ డేట్ రివీల్ చేసిన ఆహా 

ఇప్పుడు ఇండియన్ ఎంటర్టైన్మెంట్ మీడియాలో అయితే ఓటి టి రంగం కూడా ఎంతో పాపులర్ చెందింది. మరి మొదట్లో అయితే హిందీ కంటెంట్ బాగా పాపులర్ అండ్ డిమాండ్ గా మారగా నెక్స్ట్ మన తెలుగులో కూడా ఓటిటి స్టార్ట్ అయ్యింది. కాగా దీనిని మద్దతుగా నిర్మాత అల్లు అరవింద్ తన కాంపౌండ్ నుంచి అయితే “ఆహా” అనే స్ట్రీమింగ్ యాప్ తో స్టార్ట్ చేశారు.

మరి ఈ యాప్ లో అయితే తెలుగు కంటెంట్ నే ప్రధానంగా తీసుకొచ్చారు. అయితే ఇందులోనే టాలీవుడ్ మాస్ గాడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన మొదటి ఓటిటి షో నే ‘అన్ స్టాప్పబుల్’. మరి ఈ షోతో బాలయ్య ఇండియన్ లోనే బెస్ట్ షోగా దానిని నిలపగా ఇప్పుడు మూడో సీజన్లోకి కూడా తాను వచ్చేసారు.

మరి ఇప్పుడు బాలయ్య ఇన్ని ఎపిసోడ్స్ లో కూడా ఓ బిగ్గెస్ట్ ఎపిస్తుందో ని ఇప్పుడు కంప్లీట్ చేసాడు. ఫస్ట్ టైం అయితే బాలయ్య బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ఎపిసోడ్ చేయగా ఇదే మొదటి పాన్ ఇండియా ఎపిసోడ్ గా అయితే నిలిచింది. దీనితో ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ఎపిసోడ్ పై అయితే మేకర్స్ ఆడితే అప్డేట్ ని ఇచ్చేసారు.

ఈ ఎపిసోడ్ ని ఈ నవంబర్ 24న అయితే స్ట్రీమింగ్ కి తీసుకొస్తునట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా రణబీర్ హీరోగా నటించిన చిత్రం “ఆనిమల్” డిసెంబర్ 1న రిలీజ్ చేస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే సందీప్ వంగ ఈ చిత్రంని దర్శకత్వం వహించాడు. 
https://x.com/ahavideoIN/status/1725048629818278134?s=20