అక్కినేని యువ హీరో అఖిల్ ఏజెంట్ మూవీ తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారని తెలుస్తుంది. ఓ విధంగా అఖిల్ మార్కెట్ రేంజ్ కి మించి ఈ సినిమాపై సురేందర్ రెడ్డి ఖర్చు పెట్టారు.
ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఏజెంట్ మొదటి రోజే ఊహించని విధంగా నెగిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది. సినిమాలో అఖిల్ పెర్ఫామెన్స్, అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తప్ప అసలు కంటెంట్ లేదని ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాట. రొటీన్ స్టోరీ లైన్ తీసుకొని దానికి హై వాల్యూమ్ లో తెరపై ఆవిష్కరించారు.
ఆయన ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ రిపోర్ట్ చూసుకుంటే
నైజాంలో 1.33 కోట్ల షేర్
సిడెడ్ లో 64 లక్షలు
యూఏఈలో 54 లక్షలు
తూర్పుగోదావరిలో 29 లక్షలు
పశ్చిమ గోదావరిలో 21 లక్షలు
గుంటూరులో 52 లక్షలు
కృష్ణా జిల్లాలో 22 లక్షలు
నెల్లూరులో 16 లక్షలు షేర్ కరెక్ట్ అయింది
రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు కోట్ల షేర్ ఏజెంట్ సినిమా మొదటి రోజు రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 6.60 కోట్లు కలెక్ట్ అయింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షల షేర్ వచ్చింది. మొదటిరోజు కేవలం 65 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 4.95 కోట్ల షేర్ ఏజెంట్ సినిమా రాబట్టడం విశేషం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 36.20 కోట్ల బిజినెస్ చేసింది.
ఈ నేపథ్యంలో 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే 32.05 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం మూవీ టాక్ చూసుకుంటే కంప్లీట్ నెగిటివ్ గా సాగుతోంది. అయితే 2015లో అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ భారీ హైప్ తో ఏకంగా మొదటి రోజు 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
టికెట్ ధరలు తక్కువగా ఉన్న కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషం. అయితే ప్రస్తుతం టికెట్ ధరలు డబల్ అయిన కూడా అఖిల్ మొదటి సినిమా కలెక్షన్స్ లో సగం మాత్రమే ఏజెంట్ కి వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదని చెప్పొచ్చు. కనీసం ఐదు కోట్ల షేర్ కూడా ఏజెంట్ సినిమా రాబట్టలేక చతికిల పడిపోయింది