అఖిల్ అక్కినేని భారీ బడ్జెట్ చిత్రం ఏజెంట్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఇప్పటికే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కనీసం అందులో 10వ వంతు కలెక్షన్స్ కూడా బిగ్ స్క్రీన్ నుంచి సాధించలేకపోతోందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రెండో రోజే ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.
ఇక మూడో రోజు, నాలుగో రోజు మరింతగా దిగజారిపోయాయి. దీనికంటే సాయి తేజ్ విరూపాక్ష మూవీకి మంచి కలెక్షన్స్ రావడం విశేషం. ఇక ఏజెంట్ మూవీ ఓవరాల్ గా నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ లెక్క చూసుకుంటే.
నైజాంలో 1.64 కోట్లు
సీడెడ్ లో 81 లక్షలు
ఉత్తరాంద్రలో 78 లక్షలు
తూర్పు గోదావరిలో 44 లక్షలు
పశ్చిమ గోదావరిలో 39 లక్షలు
గుంటూరులో 66 లక్షలు
కృష్ణా జిల్లాలో 33 లక్షలు
నెల్లూరులో 22 లక్షలతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో 5.27 కోట్ల షేర్ ఏజెంట్ మూవీకి వచ్చింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 37 లక్షలు, ఓవర్సీస్ లో 80 లక్షల షేర్ ని రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 6.44 కోట్ల షేర్ ని రాబట్టినట్లు అయ్యింది. ఈ సినిమా ఓవరాల్ గా 36.20 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ చేసింది. దీంతో 37 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ గా ఏజెంట్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇంకా క్లీన్ హిట్ కావాలంటే 30.56 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ క్లోజ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. దీనిని బట్టి బ్రేక్ ఎవెన్ లోనే 30 కోట్ల నష్టం డిస్టిబ్యూటర్స్ కి ఏజెంట్ మూవీ మిగల్చబోతుంది. ఈ నష్టాన్ని నిర్మాతే భరించాల్సి ఉంటుంది. మొత్తానికి అనిల్ సుంకర చెప్పినట్లు ఏజెంట్ మూవీ సురేందర్ రెడ్డి, నిర్మాత కలిసి చేసిన ఖరీదైన తప్పు అని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.