ఓ సినిమా గాని బాగుంటే అమితంగా ఆదరించడంలో తెలుగు ఆడియెన్స్ ముందుంటారని మేము చెప్తున్నా మాట కాదు ఇతర భాషల హీరోలు చెప్పే మాట ఇది. తమిళ్ హీరోలు విక్రమ్, సూర్య, కార్తీ, ఆఖరికి ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఇదే చెప్పారు. కానీ తమిళ్ తంబీలు అదే తమిళ్ ఆడియెన్స్ మాత్రం తీరా మనకే సినిమాలు చూడడం రాదు మా సినిమాలు మీరు ఆదరించరు అంటారు.
ఇక్కడ ఇప్పుడు మరోసారి తమిళ్ మరియు తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమా ధనుష్ సినిమా “సార్” తో మన వాళ్ళు మరోసారి తమిళ్ ఆడియెన్స్ లో ఉన్న మాటని తప్పని ప్రూవ్ చేశారు. ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో తెలుగు తమిళ్ రెండు వెర్షన్స్ లో కూడా రిలీజ్ అయ్యింది.
అలాగే తమిళ్ లో కొన్ని ఎక్కువ లొకేషన్స్ ఎక్కువ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయ్యింది కానీ సీన్ కట్ చేస్తే తమిళ్ కన్నా ఈ సినిమాని తెలుగు ఆడియెన్స్ నే ఎక్కువ చూసేందుకు ఆసక్తి కనబరిచారు. దీనితో వాథి కన్నా సార్ ప్రీమియర్ వసూళ్లే ఎక్కువ రావడం విశేషం.
దీంతో మరోసారి తెలుగు ఆడియెన్స్ వారేంటో ప్రూవ్ చేసారని చెప్పాలి. కాగా ఈ సినిమాలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు ఆలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణం వహించాడు. తమిళ్ లో 7 స్క్రీన్ స్టూడియోస్ వారు డిస్ట్రిబ్యూట్ చేసారు.