ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర మంచి థ్రిల్లర్ చిత్రాలకి డిమాండ్ నెలకొంది. అది క్రైమ్ అయినా, సస్పెన్స్ అయినా అలాగే మంచి గంతేసి జానర్ లో అయినా కూడా సాలిడ్ థ్రిల్లర్ చిత్రాలు కథ బాగుంటే టాలీవుడ్ ఆడియెన్స్ భారీ హిట్ చేస్తున్నారు. అలా లేటెస్ట్ గా వచ్చిన లేటెస్ట్ చిత్రం “విరూపాక్ష”.
యంగ్ హీరో సాయి నటించిన ఈ సినిమాని కార్తీ వర్మ దండు చేతబడి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి భారీ హిట్ కొట్టాడు. హారర్ ఎఫెక్ట్ లేకుండా చేసిన ఈ చిత్రం థ్రిల్లర్ ఆడియెన్స్ ని మెప్పించగా ఇప్పుడు దీనికి మించి థ్రిల్ ఇచ్చేలా వస్తున్నా మరో సినిమానే “ఊరు పేరు భైరవకోన”.
క్రేజీ థ్రిల్లర్స్ ను హ్యాండిల్ చేయడంలో మంచి పేరున్న టాలెంటెడ్ దర్శకుడు ఎక్కడికిపోతావు చిన్నవాడా, డిస్కో రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలు చేసిన తాను ఇప్పుడు ఏఈ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు సందీప్ కిషన్ బర్త్ డే కానుకగా అయితే రిలీజ్ చేయగా ఇది కూడా విరూపాక్ష తరహాలో క్రేజీ సప్సెన్స్ గా ఉంది.
అంతే కాకుండా ఇందులో శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో ఉన్న గరుడ పురాణంకి ఇప్పుడు ఉన్న గరుడ పురాణంకి 4 పేజీలు తగ్గాయి ఎందుకు? అంటూ ఆసక్తి తో స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ అయ్యిన ఈ సినిమాలో భైరవకోన అనే ఊరిలోకి వెళ్తే మళ్ళీ ఎవరూ తిరిగి రారు అలంటి ఊరిలో ఉన్న మిస్టరీ ని సందీప్ కిషన్ ఎలా ఛేదిస్తాడు.
అనేది కొంచెం విరూపాక్ష తరహాలో అనిపిస్తుంది. కానీ చాలా విజువల్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ల వరకు ఆగాల్సిందే.