సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల

హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.

ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.

ఊరు పేరు భైరవకోనలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ వుండబోతుంది. టీజర్ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: విఐ ఆనంద్
సమర్పణ: అనిల్ సుంకర
నిర్మాత: రాజేష్ దండా
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన
పీఆర్వో: వంశీ-శేఖర్