“ఉస్తాద్” తర్వాత మహేష్ గ్లింప్స్ కి కూడా క్రేజీ ప్లానింగ్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ఒకటైన చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి అయితే రీసెంట్ గానే అదిరే మాస్ గ్లింప్స్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేయగా దీనికి రికార్డు వ్యూస్ అయితే వచ్చాయి. మరి ఈ చిత్రం టీజర్ గ్లింప్స్ ని ఆన్లైన్ తో పాటుగా థియేటర్స్ లో కూడా రిలీజ్ చేశారు.

అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయలేదు కానీ హైదరాబాద్ లో చేశారు. ఇక ఇదిలా ఉండగా ఇక నెక్స్ట్ టాలీవుడ్ దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సూపర్ మాస్ గ్లింప్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు 28 దే అని చెప్పాలి. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వీడియో అయితే ఆల్రెడీ ఈ మే 31 కి లాక్ అయ్యింది.

కాగా ఇపుడు కొన్ని ట్రస్టెడ్ సినీ వర్గాల నుంచి అయితే ఈ వీడియో ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. కాకపోతే ఇది ఉస్తాద్ లా కాకుండా పెద్ద ఎత్తుగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అతి త్వరలోనే బిగ్ అప్డేట్ కూడా రానుంది.

కాగా ఈ చిత్రంలో శ్రీ లీల, పూజా హెగ్డే లు హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.