ఇన్సైడ్ టాక్ : మహేష్ తర్వాత ఊహించని హీరోతో జక్కన్న.?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం నెంబర్ 1 దర్శకుడు ఎవరు అంటే అది నిర్మొహమాటంగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పాలి. కాగా దర్శకుడు రాజమౌళి అయితే రీసెంట్ గా “ట్రిపుల్ ఆర్(RRR)” తో సెన్సేషనల్ గ్లోబల్ హిట్ ని తాను అందుకోగా నెక్స్ట్ అయితే రాజమౌళి ఏకంగా పాన్ వరల్డ్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ చిత్రం ఓ లెవెల్లో ప్లానింగ్ లు చేస్తుండగా మహేష్ బాబు తో సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారు అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా తర్వాత అయితే జక్కన్న ఫస్ట్ టైం ఓ బాలీవుడ్ హీరో తో సినిమా చేయనున్నాడట.

ఇదే నిజం అయితే మొదటి సారి టాలీవుడ్ హీరో కాకుండా హిందీ హీరోతో చేయడం అని చెప్పాలి. మరి ఈ హీరో అయితే దాదాపు టాలెంటెడ్ పవర్ హౌస్ రణ్వీర్ సింగ్ తో అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

ఇప్పటికే మహేష్ తో సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ ప్రభాస్ తో చేస్తాడని, ఎన్టీఆర్ తో అని అలాగే మళ్ళీ ట్రిపుల్ ఆర్ (RRR) కి సీక్వెల్ ని చేస్తాడనీ టాక్ ఉంది. మరి ఇవన్నీ దాటి జక్కన్న ఆ ఊహించని సినిమా చేస్తాడా లేదా అనేది చూడాల్సిందే. ఇప్పుడు ఐతే మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తాను బిజీగా ఉండగా ఆర్ ఆర్ ఆర్ అయితే జపాన్ దేశంలో ఇంకా దుమ్ము లేపుతూ కొనసాగుతుంది.