యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రామాయణం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇక జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఇండియన్ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా విజువల్ గ్రాండియర్ గా త్రీడీలో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూపించబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీలో సీతాదేవిగా కృతి సనన్, లంకేష్ రావణ్ సైఫ్ ఆలీఖాన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మూవీ మీద భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. అందరికి తెలిసిన కథనే అయిన దర్శకుడు ఓం రౌత్ ఎలా చూపించాడు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.
చిత్రంపై ఏకంగా 550 కోట్ల బిజినెస్ జరిగిందని బిటౌన్ లో వినిపిస్తోన్న మాట. బాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ బిజినెస్ ఆదిపురుష్ చిత్రానికి జరగడం విశేషం. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలోనే ఏకంగా 250 కోట్ల డీల్ కుదిరిందంట. అంటే పెట్టిన పెట్టుబడిలో 75 శాతం వీటి ద్వారానే వచ్చేశాయి. ఇక ఆడియో రైట్స్ టి-సిరీస్ దగ్గరే ఉంచుకుంది.
తెలుగు రైట్స్ ని ఏకంగా 185 కోట్లకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. హిందీ, ఓవర్సీస్ తో పాటు తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో నిర్మాత సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఏరియా వైజ్ గా థీయాట్రికల్ రైట్స్ ని ఇవ్వడం జరిగిందంట. తద్వారా మూవీపై భారీగానే బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా అన్ని భాషలలో కలుపుకొని 550 కోట్ల బిజినెస్ ఆదిపురుష్ చిత్రంపై జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
పాజిటివ్ టాక్ తెచ్చుకొని కరెక్ట్ గా పబ్లిక్ కి గ్రాబ్ చేస్తే వారం రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఎవెన్ అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ 6న తిరుపతిలో భారీఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి యాక్టివ్ గా ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ దృష్టి పెట్టబోతోందని తెలుస్తోంది.